14 May, 2026 | 3:06 AM

60 ఏళ్ల వ్యక్తికి అరుదైన శ్వాసనాళ చికిత్స

14-05-2026 02:25 AM

కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో నిర్వహణ

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత నెలల తరబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, సరిగా మాట్లాడలేని 60 ఏళ్ల రోగికి కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో వైద్యులు అత్యాధునిక శ్వాసనాళ చికిత్స నిర్వహించి మళ్లీ సాధా రణ శ్వాస, మాట్లాడే సామర్థ్యాన్ని కల్పించారు.

హైదరాబాద్‌కు చెందిన ఈ రోగి ప్రమాదంలో గాయపడడంతో ముందుగా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నారు. కోలుకునే సమయంలో శ్వాస సౌకర్యం కో సం ట్రాకియోస్టమీ చేశారు. ట్రాకియా అంటే ఊపిరితిత్తులకు గాలి వెళ్లే ప్రధాన శ్వాసనాళం. అయితే అనంతర కాలంలో పలుమా ర్లు ట్యూబ్ తొలగించే ప్రయత్నాలు చేసినా విజయవంతం కాలేదు. దీంతో రోగి శ్వాస తీసుకోవడమే కాకుండా మాట్లాడటంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కే ర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ పల్మనాలజీ విభాగానికి తరలించారు.

వైద్యులు నిర్వహించిన బ్రోంకోస్కోపీ పరీక్షల్లో ట్రాకియల్ స్టెనోసిస్ అనే ప్రమాదకర పరిస్థితి బయటపడింది. శ్వాసనాళం దాదాపు 90 శాతం వర కు కుం చించుకుపోయి ఉండటంతో పరిస్థితి అత్యం త క్లిష్టంగా మారింది.  సీనియర్ కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సతీష్ సి రెడ్డి, కన్సల్టెంట్ ఈఎ న్టీ, హెడ్ అండ్ నెక్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఎం అబ్దుల్ అమ్జాద్ ఖాన్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యంత క్లిష్టమైన రిజిడ్ బ్రోంకోస్కోపీ ప్రక్రియను నిర్వహించింది.

అడ్వానస్డ్ ఎలక్ట్రో కాటరీ నైఫ్ టెక్నిక్, సీఆర్‌ఈ  బెలూన్ డైలటేషన్ ద్వారా మూసుకుపోయిన శ్వాసనాళాన్ని జాగ్రత్తగా తెరిచారు. తిరిగి సమస్య రాకుండా ఉండేందుకు సిలికాన్ స్టెంట్‌ను అమర్చారు. ఈ అత్యాధునిక మినిమల్లి ఇన్వేసివ్ చికిత్స వల్ల పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే రోగికి వెంటనే ఉపశమనం ల భించింది. చికిత్స అనంతరం రోగి మళ్లీ సులభంగా మాట్లాడగలిగే స్థితికి చేరుకుని, సాధారణంగా శ్వాస తీసుకుంటున్నారు.