ఇష్టారాజ్యం.. మట్టి తవ్వకం..
- ఉనికి కోల్పోతున్న చెరువులు
- మరమ్మతులను పట్టించుకోరు..
- మట్టి తోలకాలకు అనుమతిస్తారు..
మహబూబాబాద్/కేసముద్రం, మే 27 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెరువులు, కుం టల్లో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. మట్టి తరలింపునకు సంబంధిత ఇరిగేషన్ శాఖ ఇచ్చిన గోరంత అనుమతితో కొం డంత తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మట్టి తరలింపునకు అనుమతి ఇచ్చిన ఇరిగేషన్ శాఖ, మట్టి తవ్వకాల అంశాన్ని పట్టించుకోకపోవడంతో మ ట్టి తవ్వకాలను అడ్డదిడ్డంగా నిర్వహిస్తూ చెరువులు, కుంటల ఉనికికి దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్న పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.
జిల్లాలో ప్రధా న ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న గ్రీన్ ఫీల్ హైవే నిర్మాణ పనులు పేరుతో కొందరు, ఇతర అవసరాల కోసం అని మరికొందరు అనుమతులు పొంది, ఆ అనుమతుల ప్రకారం కాకుండా చెరువులను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. భారీ యంత్రాలు ప్రోక్లైనర్, హిటాచి యంత్రాలతో మట్టిని అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా తవ్వుతూ డంపర్లతో రవాణా చేస్తూ అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
జిల్లాలోని గూడూరు, నరసింహులపేట, మరిపెడ, బయ్యారం, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు, కురవి, ఇనుగుర్తి తదితర మండలాలతో పాటు ఇతర ప్రాం తాల్లో కూడా చెరువులు, కుంటల్లో మట్టి తవ్వకాలు యదేచ్ఛగా సాగుతున్నాయి. నిర్ణీత అనుమతికి మించి చెరువుల్లో 15 అడుగుల వరకు తవ్వకాలు జరుపుతూ చెరువుల మనుగడకు నష్టం కలిగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులు అక్కడ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహిస్తూ, నిబంధనల ప్రకారం మట్టిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అయితే ఎక్కడ కూడా ఇరిగేషన్ శాఖ అధికారుల జాడే కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మరమ్మతులను పట్టించుకోరు..
రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో అనేక చెరువులు, కుంటలు దెబ్బతిన్న సకాలంలో మరమ్మతులు నిర్వహిం చడంలో చూపించని ఆసక్తి, మట్టితోలకాలపై మాత్రం చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో అనేక చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయాల్సి ఉందని, అలాగే మత్త ల్లు, తూములు, సాగునీటి కాలువలకు మరమ్మతులు చేయాల్సి ఉందని, ఇవేవీ పట్టించు కోవడం లేదని విమర్శిస్తున్నారు.
ఇటుక బట్టీలకు తరలుతున్న రేగడి మట్టి..
చెరువుల్లో పేరుకుపోయిన పూడిక మట్టి ని, ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పూడిక మట్టి పెరిగిపోయిందనే సాకుతో ఇటుక బట్టీల యజమానులకు మట్టి తోలకాలకు అనుమతిస్తూ, పెద్దఎత్తున చెరువులను లూటీ చేస్తు న్నట్లు విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం మట్టి తోలకాలు నిర్వహిస్తే క్యూబిక్ మీటర్కు కొంత చొప్పున ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుందని, అయితే మొక్కుబడిగా కొంత మొత్తానికి చెల్లింపు చేసి, అను మతి పొంది పెద్ద ఎత్తున మట్టి ఇటుక బట్టీలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. జిల్లా యంత్రాంగం స్పం దించి అక్రమ మట్టి తవ్వకాలకు బ్రేక్ వేయాలని, చెరువులు కుంటల భవితవ్యాన్ని కాపా డాలని కోరుతున్నారు.
రాత్రిపూట తవ్వకాలు?
మట్టి తీసుకు వెళ్లడానికి అన్ని అనుమతులు ఉంటే రాత్రిపూట మట్టి తవ్వకాలు ఎందుకు తీస్తున్నారనే విమర్శలు వస్తున్నా యి. పొద్దంతా చెరువు ముఖం వైపు చూడకుండా, రాత్రి కాగానే భారీ వాహనాలు చెరు వుల్లోకి క్యూ కట్టి, మట్టిని తెల్లారేసరికి మా యం చేస్తున్నాయి. ఈ విషయం ఆయా గ్రా మాల ప్రజలకు తెలిసి చెరువు వద్దకు చేరుకునేసరికి, రాత్రికి రాత్రి మట్టి మాయం అయిపోయిన ఘటన చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అన్ని అనుమతులు ఉంటే ఇలా రాత్రిపూట మట్టి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.
ఇటుక బట్టీలకు అనుమతి లేదు..
కేసముద్రం మండలంలో ఇటుక బట్టీలకు అనుమతి లేదు. మట్టి తోలకాలకు పాల్పడుతున్న విషయం మా దృష్టికి రాగానే, అనుమతి చూపాలని ఆదేశించాం. అనుమతి చూపకపోవడం తో మట్టి తోలకాలను నిలిపి వేయించాం. చెరువులపై పూర్తి ఆజమాయిషి ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉంటుంది. ప్రజల నుండి ఫిర్యాదులొస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళుతున్నాం.
జీ.వివేక్, తహసీల్దార్, కేసముద్రం






