మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి
- సికింద్రాబాద్ నుంచి పసుపు పండుగ మహానాడు
- తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్
సికింద్రాబాద్, మే27 (విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహానాయకుడు ఎన్టీఆర్ జయంతితెలుగు జాతి కీర్తి మహోత్సవం మహానాడు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల్లో నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు.
ఈ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి సికింద్రాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గంకి చెందిన తెదేపా నాయకులు,మహిళ నాయకురాళ్ల కార్యకర్తలు తో కలిసి బౌద్ధనగర్ నుండి బంజారాహిల్స్ హైదరాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.అనంతరం తెదేపా పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి,ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.1875 క్లస్టర్ల ను పార్టీ కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేశారు.వేలాదిమంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించనున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ నేతలు వీక్షించారు.
ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు పరిటాల విజయ్ కుమార్,జి.వి కృష్ణ,చిరంజీవిరాజు,శశిరేఖ,పూజా,పిట్ల శంకర్ ముదిరాజ్,వెంకట్ స్వామి,జగదీష్ , మురళి,పుప్పాల విజయ్ కుమార్,చందర్ ముదిరాజ్,చంద్రమోహన్,రాహుల్, శ్రీను యాదవ్, సుధాకర్,దేవేందర్,నాయుడు, సాయి,టైలర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.






