27 May, 2026 | 6:05 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్

27-05-2026 05:24 PM

హైదరాబాద్:  హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ముందే కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. గాంధీభవన్ లో చొక్కాలు పట్టుకుని కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చొనే అంశంపై గొడవ జరిగింది. ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ప్రొటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్(Feroz Khan), ఉస్మాన్ అల్ హజ్రీ గొడవ పడ్డారు. ఉస్మాన్ అల్ హజ్రీ తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోయారు. ఇద్దరి మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు వీహెచ్ ప్రయత్నించారు. వీహెచ్ ను కూడా తోసేందుకు యత్నించగా నేతలు అడ్డుకున్నారు. దీంతో అగ్రహించిన మంత్రి అజారుద్దీన్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. గొడవ జరగడంతో సమావేశం ముగిసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.