27 May, 2026 | 6:07 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం

27-05-2026 05:04 PM

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని  ఉదృతమవుతున్న పోరాటం

కొండపైన వర్తక సంఘాన్ని రద్దుచేసి టెండర్లు వేయాలి

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్ డిమాండ్

దేవాదాయ కమిషనరేట్ ముందు ధర్నా

యాదగిరిగుట్ట, మే 27 (విజయక్రాంతి):  యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దుచేసి టెండర్లు వేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  యాదాద్రి పరిరక్షణ  సమితి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా చేస్తున్న ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా  యాదాద్రి పరిరక్షణ స మితి ఆధ్వర్యంలో  యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాని రద్దు చేసి టెండర్లు వేయాలని బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

దేవాదాయ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తుండడంతో అక్కడి స్థానిక పోలీస్ యాదాద్రి పరిరక్షణ సమితి సభ్యులను చెదరకొట్టరు.దేవాదాయ శాఖ కమీషనర్ హనుమంతరావు ను  కలిసి వినతి పత్రం అందజేశారు . అనంతరం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) అక్కడికి చేరుకొని యాదాద్రి పరిరక్షణ సమితి సభ్యులకు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపైన వర్తక సంఘాన్ని రద్దుచేసి టెండర్ వేయాలని అరకురా కిరాయిలతో దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారని, దేవస్థానానికి ప్రస్తుతం కోటి 60 లక్షలు ఆదాయం రాగా  టెండర్లు వేస్తే  దేవస్థానానికి 20 నుండి 30 కోట్ల ఆదాయము సమకూరుతుందని,  భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించవచ్చనని,నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. 

కొండపైన వర్తక సంఘంన్ని  తక్షణమే రద్దు చేసి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ గతంలోనూ కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని పలు ఆందోళనలు చేశారని అయినా ప్రభుత్వం అధికారులు పెడచిన పెడుతున్నారని , గత నెల రోజులుగా యాదగిరిగుట్ట లో వివిధ పార్టీ ల నాయకులు, నిరుద్యోగులు, నిర్వాసితులు  వివిధ రూపాలలో పోరాటం చేస్తున్న అధికారులు ప్రభుత్వం కనీస స్పందన లేదుని అన్నారు. వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు వేయకుంటే యాదాద్రి పర్యవేక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయని దీనికి ప్రభుత్వము, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది అన్నారు.

ఈ కార్యక్రమం మాజీ వార్డు సభ్యులు కాటబత్తిని   ఆంజనేయులు , పల్లపు బాలయ్య, బండ రామస్వామి,దేవపూజ అశోక్,బుగ్గ ఆంజనేయులు, ,కొన్నె సంజీవ,బండి అనిల్,ముక్కెర్ల వెంకటేష్, నర్సింహా,కర్రె ప్రవీణ్,మాటూరి బాలయ్య, మిర్యాల క్రిష్ణ, పల్లపు రవి,దార నవీన్,దొమ్మాట ప్రభాకర్, మందోజ్ నరేష్, వాల్మీకి అజయ్, సుధాగాని శివ,మెరుగు వెంకటేష్, కర్రె శ్యామ్, లక్ష్మయ్య, ,గుండు కుమార్ ,లింగాల వెంకటేష్,పులగo నరేష్,కాంటెకర్ శ్రవణ్,కారుమించి నాగేందర్ రెడ్డి, గడ్డమీది శ్రీకాంత్, శ్రీనాథ్,బుదారం రమేష్,గణేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.