కార్మికుల పాత్ర విడదీయరానిది
బీఎన్‌ఆర్‌కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న
జవహర్ నగర్, మే 27 (విజయక్రాంతి): భవన నిర్మాణరంగంలో తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ కార్మికుల పాత్ర విడదీయరానిదని తాపీ మేస్త్రీలు సెంట్రింగ్ కార్మికులు గొప్ప అనుబంధంతో పనిచేస్తారని బి ఎన్ ఆర్ కే ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న తెలిపారు.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ గిరిప్రసాద్ నగర్ భవన నిర్మాణ సంఘం కార్యాలయంలో బుధవారం, జూన్ 8వ తేదీన హైదరాబాద్లోని భవన నిర్మాణ రంగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నందున జూన్ 8వ తేదీన బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సభకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఎన్ ఆర్ కే ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న హాజరై మాట్లాడుతూ సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమ్మె నేపథ్యంలో తాపీ మేస్త్రీలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. భవన నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రీలు సెంట్రింగ్ కార్మికుల పాత్ర విడదీయరానిదని కార్మికుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కులు ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బియన్ ఆర్ కె ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సూర వెంకటయ్య, గిరిప్రసాద్ నగర్ శాఖ అధ్యక్షులు సిహెచ్ వెంకటయ్య, ఉపాధ్యక్షులు కే. రామాచారి, రవీంద్ర చారి, కార్యదర్శులు రుక్మయ్య, కాలనీ అధ్యక్షులు లింగోజి, బస్తి నాయకులు కురుమన్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.






