29 August, 2026 | 5:21 AM

సమాజంలో ప్రేమ అనుబంధాలను కలిపేది రక్షాబంధన్

29-08-2026 02:21 AM

మాగనూరు, ఆగస్టు 28: సమాజంలో ప్రేమ అనుబంధాలను కలిపేదే రక్షాబంధన్ అని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యవాహ పృథ్వీరాజ్ అన్నారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మాగనూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆవరణలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్షాబంధన్ కార్యక్రమానికి పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ. ఈ యొక్క రక్షాబంధన్ కార్యక్రమం మన పూర్వీకుల నుండి వచ్చిన సాంప్రదాయ పండుగ అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా దేశంలో అనేక ప్రాంతంలో ఈ యొక్క రాఖీ పండుగను ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు.  భారతదేశంలో కాక ప్రపంచంలో ఉన్న  ప్రతి హిందూ సోదరులు, అక్కా చెల్లెళ్ల అనుబంధం కోసం, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాలని విదేశీ సంస్కృతిని విడనాడాలని వారి సందర్భంగా గుర్తు చేశారు. పురుషోత్తం, అశోక చక్రవర్తి, శివాజీ మహారాజ్, వారి హిందూ సామ్రాజ్యం కోసం హిందువులను ఏకతాటికీ తెచ్చిన వివరాల గురించి మాట్లాడారు.అనంతరం ఒకరికొకరు రాఖీలు కట్టుకొని నీకు నేను రక్ష నీవు నాకు రక్ష మన ఇద్దరం దేశానికి రక్ష అని రక్షా కంకణాలు కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.