దామరచర్ల గురుకులంలో రక్షాబంధన్ వేడుకలు
దామరచర్ల, ఆగస్టు 28: మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుకుల విద్యార్థినులు ఎమ్మెల్యేకి రాఖీలు కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు. విద్యార్థినుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థినులకు కానుకగా పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రక్షా బంధన్ స్ఫూర్తితో ప్రేమ, బాధ్యత, పరస్పర గౌరవం వంటి విలువలను పెంచుతూ అందరం కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సైదా నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నాగు నాయక్,మాజీ సర్పంచ్ బి కిరణ్, గాజుల శ్రీనివాస్, గాలం వెంకన్న, గురుకుల పాఠశాల సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






