29 August, 2026 | 6:15 AM

ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

29-08-2026 12:00 AM

సూర్యాపేట, ఆగస్టు 28 (విజయక్రాంతి): పట్టణంలో డి మార్ట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్,  యుఐడిఐఎ డిప్యూటీ డైరెక్టర్ రంగనాధ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో ఆధార్ నమోదుతో పాటు సవరణలు కూడా చేయడానికి సేవా కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

ప్రజలకు ఆదార్ కు సంబంధిత సమస్యలపై హైదరాబాదుకు పంపకుండా సూర్యాపేట లోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ సెంటర్ నందు ఆధార్ నమోదు తో పాటు ఆధార్ లో సవరణలు ఇక్కడే చేస్తారని అన్నారు. ఈ సెంటర్ నందు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యుఐ డి ఐ ఎ రీజనల్ మేనేజర్ శ్రీనివాసు,  ఎడి ఎమ్ ఆపరేషన్స్ లాలు , సిబ్బంది పాల్గొన్నారు.