ఉత్తరాదిన వర్షం
మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు
ముంబై/ఇటానగర్, జూన్ 24: మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు పలు నగరాలను ముంచెత్తుతున్నాయి. రహదారులు జలద్భిగంధనంలో చిక్కుకొని జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొండచరియలు, చెట్లు, విద్యుత్ స్తంభా లు పలు చోట్ల కూలి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లకు కారణమైంది. బుధవారం ముంబైతోపాటు ఠాణె, పాల్గర్‌లలో భారీ వ ర్షాలు కురిశాయి.
దీంతో అధికారులు పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆ దేశించారు. అంధేరిలోని సబ్‌వే పూర్తిగా నీటమునిగింది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముంబైలోని వి క్రోలి వెస్ట్‌లో ఒక నివాస భవనం సమీపం లో నిర్మించిన నిలుపుగోడ కుప్పకూలింది.
దాదర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు నీట మునిగాయి. వర్షం కారణంగా కోపర్ఖైరానే ఘన్సోలి మధ్య రైల్వే ట్రాక్ బురదతో కోతకు గురైంది. ట్రాన్స్-హార్బర్ రైలు సేవలను తా త్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం అ నుకూలంగా లేనందువల్ల బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకల సమయాల్లో అంతరాయం ఏర్పడింది.
అరుణాచల్‌లో ఐదుగురు గల్లంతు..
అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పూసా సమీపంలోని నీప్కో ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఐదుగురు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. 18 గృహాలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల వ్యవసాయ భూములూ నీట మునిగాయి. దీంతో విత్తిన విత్తనాలు కొట్టుకుపోయాయి.






