25 June, 2026 | 1:17 AM

కూలిన గిడ్డంగి

25-06-2026 12:16 AM
  1. ఐదుగురి మృతి, 20 మందికి గాయాలు
  2. మరో 20 మందిని రక్షించిన రెస్క్యూ బృందాలు
  3. శిథిలాల కింద మరికొందరు
  4. కోల్‌కతాలో ఘటన

కోల్‌కతా, జూన్ 24: పశ్చిమ బంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ దశలో ఉన్న ఓ గిడ్డంగి కూలి ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది వరకు గాయాల పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో 20 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాం తంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రులకు చేర్పించారు.

గాయపడిన వారి లో ఇద్దరి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్న ట్లు వైద్యులు తెలిపారు. దక్షిణ కోల్‌కతాలోని తారతలా రవాణా డిపో సమీపంలో ఒడిశా కు చెందిన ఒక వ్యాపారవేత్త స్థలాన్ని ప్రైవే టు సంస్థ లీజుకు తీసుకుంది. సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం లో ఉన్న ఈ గిడ్డంగి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద నుంచి భారీ ఎ త్తున ఆర్తనాదాలు, అరుపులు, రక్షించండి అంటూ కేకలు వినిపించాయని స్థానికులు తెలిపారు.

భారీ గిడ్డంగిని నిర్మిస్తుండగా కాం క్రీట్ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూలీలు, స్థానికులు తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సువేందు అధికారి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను వేగవంతానికై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటన దురదృష్టకరమన్నారు. అనంతరం గాయపడిన వారిని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో పరామర్శించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

శిథిలాల కింద మరో 10 నుంచి 15 మం ది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు రాత్రంతా కొన సాగుతాయని సీఎం సువేందు అధికారి స్పష్టం చేశారు. సీఎంతోపాటు మంత్రులు అగ్నిమిత్రపాల్, కౌశిక్ చౌదరిలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు హెల్ప్‌లైన్ నెంబర్లను జారీ చేశారు.