24 June, 2026 | 7:06 PM

చిర్రకుంటలో ఘనంగా వనమహోత్సవం

24-06-2026 05:53 PM

పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన అరిగెల నాగేశ్వరరావు

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వనమహోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట గ్రామంలో బుధవారం ఘనంగా మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు వనమహోత్సవం వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, బీజేపీ నాయకుడు బొమ్మెన శివప్రసాద్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.