రూ.2 కోట్ల సుడా నిధులతో హెలిప్యాడ్
25-06-2026 01:23 AM
కరీంనగర్, జూన్24 (విజయక్రాంతి): కలెక్టరేట్ వెనుక గల పాత హెలిప్యాడ్ పార్క్ లో నూతనంగా హెలిప్యాడ్ నిర్మాణానికి, నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ కు ఉత్తరం వైపు సిసి రోడ్డు నిర్మాణానికి పార్కులకు సుడా నిధులు 2 కోట్లతో టెండర్లు పిలిచి బుధవారం శంకుస్థాపన చేయడం జరిగింది.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్,కలెక్టర్ చిత్రా మిశ్రా, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్,అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీఏ మెంబెర్ పడాల రాహుల్ పాల్గొన్నారు.






