24 February, 2026 | 6:28 PM

సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి

24-02-2026 04:17 PM

కౌన్సిలర్ రాజురా సత్యం

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డులో నిర్మిస్తున్న సిసి రోడ్ల పనులలో నాణ్యత పాటించాలని లేకుంటే సహించేది లేదని ఆ వార్డు కౌన్సిలర్ రాజుర సత్యం అన్నారు. మంగళవారం 11వ వార్డులోని జెకె నగర్, విద్యానగర్ కాలనీలో జరుగుతున్న సిసి రోడ్ల నిర్మాణం పనులను పర్యవేక్షించారు. ఆయనతోపాటు మున్సిపల్ ఏఈ శ్రీనివాస్, కాలనీవాసులు పలువురు ఉన్నారు.