బ్యాంకుల్లో పైసలు లేవు.. ఉన్నా సర్వర్ డౌన్
నిర్మల్ జులై 14 (విజయ క్రాంతి) నిర్మల్ జిల్లాలో ప్రధాన బ్యాంకుల్లో డబ్బు కొరత ఆ రైతులను ఇటు వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. గత వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఆయా బ్యాంకుల్లో నగదు నిలువలు డిమాండ్కు తగ్గ సరఫరా కాకపోవడంతో ఉన్న డబ్బులు సర్దుబాటు చేసి పంపిణీ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎస్బిఐ యూనియన్ బ్యాంక్ దక్కన్ గ్రామీణ బ్యాంక్ సహకార బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా మహారాష్ట్ర బ్యాంక్ తదితర బ్యాంకులో రైతులు వ్యాపారులు దాచుకున్న డబ్బులను తీసుకున్నందుకు ప్రయత్నిస్తుండగా డబ్బు కొరత కారణంగా ఆంక్షలు విధిస్తున్నట్టు రైతులు తెలిపారు.
ఇప్పటికీ బ్యాంకులో రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం పంట విక్రయించగా వచ్చిన మొక్కజొన్న, వరి ఇతర పంటలకు సంబంధించిన డబ్బులు బ్యాంకులో ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ఆ డబ్బులను డ్రా చేసుకొని వ్యవసాయ పెట్టుబడులకు ఉపయోగించుకుందాం అన్న రైతులకు బ్యాంకుల్లో నగదు కొడతా కారణంగా రోజు కొంత చెల్లిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రధానంగా గ్రామీణ బ్యాంకుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు రైతులు చెప్తున్నారు.
ప్రతి రైతుకు రోజుకు 30 వేలకు మించి నగదు ఇవ్వడం లేదు. మహిళా సంఘాలకు 10000 వ్యాపారస్తులకు సర్దుబాటు చేసి అవసరం బట్టి 50 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు రైతులు వ్యాపారులు తెలిపారు. గూగుల్ పే ఫోన్ పే ఉన్న మార్కెట్లో చాలామంది దీనికి అనుమతి ఇవ్వడం లేదు. నాకు డబ్బులు చెల్లిస్తేనే లావాదేవీలు ఉంటాయని రైతులకు తెలపడంతో రైతులు పైసల కోసం పడరాని పాటుపడుతున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా లీడ్ బ్యాంకు మేనేజర్ తో సమావేశం నిర్వహించి జిల్లాలో నగదు కొడత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని జిల్లా కలెక్టర్ సూచించినట్టు తెలిపారు.






