9 July, 2026 | 2:33 AM

నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి

09-07-2026 01:46 AM

కలెక్టర్ కె.హైమావతి

సిద్దిపేట కలెక్టరేట్, జూలై 8: జిల్లాలోని అన్ని గురుకులాల్లో కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేస్తూ విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి గురుకుల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులనుఆదేశించారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

వెజిటేబుల్ బిర్యానీ, ఆలుగడ్డ టమాట కూర, గుడ్డు కూర, సాంబారు, పెరుగు నాణ్యతను తనిఖీ చేసి బిర్యానీ రుచిని అభినందించారు. రోజువారీ మెనూను కచ్చితంగా పాటించాలని, విద్యార్థుల హాజరుకు అనుగుణంగా వంట సామాగ్రిని వినియోగించాలని, ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ప్రిన్సిపాల్ లేదా ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలని, వంటగది, డైనింగ్ హాల్, గురుకుల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుని సీజనల్ వ్యాధుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.