9 July, 2026 | 2:35 AM

పామాయిల్ రైతులు ధైర్యంగా ఉండండి

09-07-2026 01:47 AM

రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

పినపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరం వెంకటేశ్వరావు

పినపాక, జూలై 8 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఈ బయ్యారం ఏర్పడబోతున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ అదిస్థానం నియమించబడిన పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరం వెంకటేశ్వరరావు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పామాయిల్ రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పామాయియిల్  రైతుల కోసం రూ 23 లక్షల వ్యయంతో మండలంలో భూపాలపట్నం పంచాయతీ పరిధిలో ఒక ఎకరం విస్తీర్ణంలో భూమిని కేటాయించటం జరిగిందన్నారు.  ఇది గమనించక కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తిగత లాభం కోసం స్వార్థ ప్రయోజన కోసం కాంగ్రెస్ పార్టీపై బురద గల్లె ప్రయత్నం చేపట్టినారు.

పామాయిల్ రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత ఈ భూమిని కేటాయించింది. ఇది గమనించక స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ ప్రభుత్వాన్ని హేళన  చేస్తున్నారు. పామాయిల్ రైతులు ధైర్యంగా ఉండండి రైతుల పండించిన పంటను స్టాక్ పాయింట్ ఏర్పడే విధంగా స్థానిక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు కృషితో త్వరలోనే ఏర్పాటు  చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గోడిశాల రామనాథం, ఇనపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పినపాక మండల సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు