గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు, జూన్17 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని దానికి అనుగుణంగా పనులు చేపడుతామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
బుధవారం బూర్గంపాడు గ్రామపంచాయతీ పరిధిలో రూ.65 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం సారపాకలోని వాసవి ఫంక్షన్ హాల్లో 34మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు, 25 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు.
తహశీల్దార్ కెఆర్ కెవి ప్రసాద్, పిఆర్ ఏఈ చక్రధర చారి, హౌసింగ్ ఏఈ ఉదయ్, సర్పంచ్ మంద నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న,జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్, మాజీ జెడ్పిటిసి విజయ్ గాంధీ, నియోజకవర్గ బి-బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి,నాయకులు బాదం రమేష్ రెడ్డి, కైపు శ్రీనివాస్ రెడ్డి,భజన ప్రసాద్, ఎడమకంటి సుధాకర్ రెడ్డి,పూలపెళ్లి సుధాకర్ రెడ్డి,మండలంలోని పలువురు సర్పంచులు ,యూత్ నాయకులు పాల్గొన్నారు.






