29 July, 2026 | 9:13 PM

Breaking News

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •  

ఐకేపీ సెంటర్ నిర్వాహకులపై ఒత్తిళ్లు

19-05-2026 01:30 AM

బెజ్జంకి, మే 18 : దళిత సామాజిక వర్గానికి చెందినవారమనే కారణంతో కులవివక్ష చూపిస్తూ ఐకేపీ సెంటర్ను మూసివేయాలని బెదిరింపులు వస్తున్నాయని ఐకేపీ నిర్వాహకులు కన్నీటి పర్యంతమయ్యారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రజా సంఘాల నాయకులు సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఐకెపి నిర్వాహకులు మాట్లాడుతూ, కొంతమంది పెద్ద రైతులు తమ వడ్లు ముందుగా కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తూ సీరియల్ విధానాన్ని పాటించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. మహిళా సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులు సమన్వయంతో సహకరించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.  అధికారులు రైస్ మిల్లర్లతో, వాహన యజమానులతో చర్చించి వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇకముందు ఎవరైనా నిర్వాహకులను కులవివక్షతో ఇబ్బందులకు గురి చేస్తే ప్రజా సంఘాల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు స్వరో రాష్ట్ర నాయకులు బొర్ర సురేష్ కుమార్, బిఎస్పినాయకులు కొంపెల్లి పర్షరాములు, డి.ఎస్.పి నాయకులు లింగాల సురేష్, ఎమ్మార్పీఎస్‌మండల అధ్యక్షులు వడ్లూరి పర్షరాములు, చింతకింది పర్షరాములు, నాయకులు లింగాల బాబు తదితరులురైతులు పాల్గొన్నారు.