హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రీత
మేడిపల్లి లేఅవుట్ ప్రాజెక్టు స్థలంలో సమావేశం
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో మేడిపల్లి లేఅవుట్‌కు సంబంధించి మంగళవారం ప్రాజెక్టు స్థలంలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 200 మందికి పైగా బిడ్డర్లు హాజరయ్యారు. అధికారులు, ప్రతినిధులు పాల్గొన్న వారి సందేహాలకు సమాధా నాలు ఇచ్చారు. మేడిపల్లి లేఅవుట్ ముఖ్యాంశాలను వివరించి, బిడ్డర్లు అడిగిన వివిధ ప్రశ్నలకు వై. సుదర్శన్, డిప్యూటీ కలెక్టర్, హెచ్‌ఎండీఏ సమాధానాలు అందించారు.
లేఅవుట్ ప్రణాళికా అంశాలు, అభివృద్ధి ప్రతిపాదనలకు సంబంధించిన సందేహాలను ఎ. రవీందర్‌రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నివృత్తి చేశారు. ఈ ప్రక్రియ, నమోదు విధా నం, బిడ్డర్ల భాగస్వామ్య మార్గదర్శకాల గురిం చి సిద్ధార్థ్, ఎంఎస్టీసీ ప్రతినిధి వివరించారు. స్థలంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించి ఎం. సత్యప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, హెచ్‌ఎండీఏ వివరించారు. లేఅవుట్‌పై పీపీటీని కళ్యాణ్, కేపీఎంజీ ప్రతినిధి సమర్పించారు. ఈ నెల 24న జరిగే ఈ విశేష ఆసక్తిని వ్యక్తం చేశారు.






