17 June, 2026 | 2:18 AM

పత్తిపై ఆర్సీఎంను తొలగించండి

17-06-2026 12:41 AM

జీఎస్టీ కౌన్సిల్‌ను కాటన్ అసోసియేషన్ వినతి

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): పత్తి గింజలపై విధిస్తున్న రివర్స్ ఛార్జ్ మెకానిజం (ఆర్‌సీఎం) సమస్యలకు శాశ్వత పరి ష్కారం కనుగొనే దిశగా జీఎస్టీ కౌన్సిల్ ఉన్నతాధికారులతో కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇం డియా (సీఏఐ) ప్రతినిధుల బృందం మంగళవారం న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది.

ఈ భేటీలో సీఏఐ అసోసియేట్ డైరెక్టర్, తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. సీఏఐ ప్రెసిడెంట్ వినయ్ ఎన్ కోటక్ నేతృత్వంలో దేశవ్యాప్త పత్తి రంగ ప్రతినిధులు హాజరై, ఆర్సీఎం విధానం వల్ల పత్తి కొనుగోళ్లు, నగదు లభ్యత వ్యాపార నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక, ఆర్థిక ఇబ్బందులను రాతపూర్వక లేఖ ద్వారా కౌన్సిల్‌కు వివరించారు. పత్తిని కొనుగోలు చేసేటప్పుడు కాకుండా, ఉత్పత్తి అమ్మకం జరిగే సమయంలోనే ఈ పన్నును వర్తింపజేయాలని కోరారు.

దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయ నష్టం ఉండదని స్పష్టం చేశారు. గతంలో ఈ చట్టంపై సరై న అవగాహన లేకపోవడం వల్ల మిల్లర్లపై విధించిన పెనాల్టీలను పూర్తిగా రద్దు చేయాల ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కాటన్ మిల్లర్లు, ట్రేడర్ల ప్రయోజనాల దృష్ట్యా ఆర్సీఎం నిబంధనలను సరళీకృతం చేయడం లేదా మినహాయింపు ఇచ్చే అంశాలను జీఎస్టీ కౌన్సిల్‌కు సిఫార్సు చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్ నుంచి పత్తి రంగానికి అనుకూలంగా స్పష్టమైన నిర్ణయం వస్తుందని బొమ్మినేని రవీందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీఏఐ వైస్ ప్రెసిడెంట్ మంజి త్, భావేష్, నార్త్ ఇండియా ప్రతినిధి మహేష్ శారడా పాల్గొన్నారు.