17 June, 2026 | 1:49 AM

బీఆర్‌ఎస్ దూకుడు!

17-06-2026 12:41 AM
  1. విస్తృతంగా సభ్యత్వ నమోదు 
  2. క్షేత్రస్థాయి వరకు అనుసంధానం 
  3. మొబైల్ అప్లికేషన్ ద్వారా విస్తృత సభ్యత్వాలు

కరీంనగర్, జూన్16(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు డిజిటల్ జోష్ కొనసాగుతోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు , క్షేత్రస్థాయి వరకు పార్టీని అనుసంధానం చేయడానికి ప్రత్యేక మొబైల్ అప్లికేషన్తో విస్తృత డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడుతున్నారు.

దీనికి తోడుసో షల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల ద్వారా బీఆర్‌ఎస్ అనుచరులు, కార్యకర్తలు అధికార కాంగ్రెస్ పార్టీ హామీలు, పాలనలోని లోపాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రత్యేక ఐటీ టీమ్స్: ఎలాంటి బాహ్య డిజిటల్ ఏజెన్సీల సహాయం లేకుండా, స్థానిక సోషల్ మీడియా సమన్వయకర్తలు,వేలాది మంది మంది పార్టీ సై నికులతో కలిసి డిజిటల్ ప్రచారాన్ని బీఆర్‌ఎస్ విజయవంతంగా నడుపుతోంది.

ఉమ్మడి జిల్లాలో ఇంచార్జీలతోపాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున 13 మందిఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇచ్చి రంగంలోకి దించారు. సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమంలో నేతకు చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్, బి ఆర్ ఎస్ పక్ష అసెంబ్లీ ఉప నేతలు పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

జగిత్యాల జిల్లా కోరుట్ల, పెద్దపల్లి జిల్లా మంతనిలో మినహా అంతటా ఉచ్చాహంగా సభ్యత్వ నమోదు కొనసాగుతుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉండేటటు వంటి అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూల్ను సభ్యత్వం అనంతరం ప్రకటిస్తా రు. ప్రకటించబడిన నిర్ణీత తేదీలలో కమిటీల నియామకం పూర్తి చేయనున్నారు.