17 June, 2026 | 3:26 AM

ఘనంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదిన వేడుకలు

17-06-2026 02:18 AM

తలమడుగు, జూన్ 16 (విజయక్రాంతి) : మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధులతో కలిసి నాయకులు కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు అన్నధానం చేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ మాట్లాడుతూ... పేదల సంక్షేమం కోసం ఎమ్మెల్యే నిరంతరం కష్టపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వినర్ తోట వెంకటేష్,ముడుపు కేదారేశ్వర్ రెడ్డి,అభిరామ్ రెడ్డి,అబ్దుల్లా,లష్మా రెడ్డి,ప్రకాష్,రమాకాంత్, రాంకిషన్,పల్లవి,ప్రమోద్, సునీతా రెడ్డి రాంబయి,నర్సింహులు, బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.