సుల్తానాబాద్‌లో ముందస్తు ఉగాది సంబరాలు
సుల్తానాబాద్, మార్చి 18 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి డిగ్రీ , పీజీ కళాశాల లో బుధవారం ముందస్తు ఉగాది సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, భక్షాలు తయారు చేయడం వంటివి అతిథులను ఆకర్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది.
తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా విద్యార్థులు వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని వచ్చి ప్రదర్శించడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల సెక్రటరీ , కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక , విశిష్ట అతిథిగా కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ లు హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బండారి కమలాకర్ విద్యార్థులు పాల్గొన్నారు.




