17 July, 2026 | 12:16 AM

31 నుంచి హైటెక్స్‌లో దీప్ మేళా

17-07-2026 12:00 AM
  1. మూడు రోజుల పాటు నిర్వహణ
  2. పోస్టర్ ఆవిష్కరించిన క్లబ్ సభ్యులు
  3. దేశ నలుమూలల నుంచి రానున్న సహజ ఉత్పత్తులు

హైదరాబాద్, జూలై 16(విజయక్రాంతి) : మూడు రోజుల పాటు హైటెక్స్ దీప్ మేళా జరగనుందని దీప్ శిఖ మహిళ క్లబ్ సభ్యు లు పేర్కొన్నారు. కొండాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని హాల్ నెం.3లో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వర కు దీప్ మేళా నిర్వహిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను అమీ ర్‌పేటలోని కన్యా గరుకుల పాఠశాలలో గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దీప్ శిఖ మహిళా క్లబ్ కమిటీ అధ్యక్షురాలు సంగీత జైన్ మా ట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన దీప్ శిఖ మహిళా సేవా సంస్థకు 62 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ క్లబ్ ద్వారా నిరుపేద మ హిళల కు మద్దతు అందించడంతో పాటు, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో అంకితభావంతో పని చేస్తోందన్నారు. వారి ఆర్థికసాయం కోసం ప్రతీ సం వత్సరం దీప్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 

ఈ సంవత్సరం జూలై 31 నుంచి ఆగస్టు 2వ వరకు హెటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ హాల్-3లో ఈ మేళా జరగునందని తెలిపారు. ఈ మేళాలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి చేనేత వస్తువులతో పాటు అన్ని రకా ల ఉత్పత్తులు కొలువుదీరుతాయన్నారు.   కార్యక్రమంలో అధ్యక్షురాలు సంగీత జైన్, ఉపాధ్యక్షురాలు భావ్నా సంఘి, కార్యదర్శి మీనాక్షి భో రారియా, కోశాధికారి శివాని తిబ్రేవాల్, సం యుక్త కార్యదర్శి మమతా భండారి,  సభ్యులు పద్మ సుల్తాని యా, శోభా బన్సల్, అనితా గోయల్, బబితాఝబక్, మలా బద్రుక, ప్రియాంక సురానా  పాల్గొన్నారు.