30 May, 2026 | 10:49 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

అచ్చంపేట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు

30-05-2026 09:51 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక విద్యాభివృద్ధిలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని ఎంపీపీఎస్ అచంపేట్ పాఠశాలకు ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరైనట్లు మండల విద్యాశాఖ అధికారి వై.తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల ద్వారా విద్యార్థుల్లో పాఠశాల పట్ల ఆసక్తి పెంపొందడంతో పాటు వారి మానసిక, సామాజిక, భాషా నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, బోధన-అభ్యాస సామగ్రి మరియు ప్రత్యేక తరగతి గదుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు.