calender_icon.png 19 February, 2026 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ప్రతిభా రత్న పురస్కారం

19-02-2026 02:42:38 AM

పురాస్కారాలు అందజేసిన గవర్నర్

కుషాయిగూడ ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : హిందీ సేవా సదన్ మహావిద్యాల య్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి హిందీ ప్రతిభా పరీక్షలో నాగారం సెరినిటీ పాఠశాలకు చెందిన విద్యార్థులు పి. ఆరాధ్య (6వ తరగతి), ఎం. హారిక (10వ తరగతి) ప్రథమ స్థానం సాధించారు. హిందీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు వారికి ప్రతిభా రత్న పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా విద్యార్థులు పురస్కారాన్ని అందుకున్నారు.

విజేతలకు రూ.2,500 నగదు బహుమతి, బంగారు పతకం, ప్రశంసా పత్రం అందజేశారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకో వడం పాఠశాలకు గర్వకారణమని సెరినిటీ పాఠశాల కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.