5 May, 2026 | 4:52 AM

ఆర్మూర్‌లో ప్రజావాణి ప్రారంభం

05-05-2026 12:44 AM

అర్మూర్, మే 4 (విజయక్రాంతి): ఆర్మూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్మూర్ సబ్-కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విభాగ స్థాయి అధికారులు అందరూ హాజరై పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం నాలుగు వినతిపత్రాలు స్వీకరించారు. అందిన వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించబడతాయని సబ్-కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ హామీ ఇచ్చారు.