27 June, 2026 | 3:33 AM

పార్కింగ్ అడ్డాలుగా ప్రభుత్వ కార్యాలయాలు

27-06-2026 02:13 AM
  1. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే వారికి తప్పని అవస్థలు
  2. ఇబ్బందికరంగా పేరుకుపోయిన చెత్త - మూత్రశాలలు లేక తప్పని ఇబ్బందులు.
  3. మఠంపల్లి ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ లేక కష్టతరంగా మారిన నిర్వహణ
  4. అధికారులు ఇబ్బందులు తొలగించాలని ప్రజల వేడుకోలు

సూర్యాపేట, జూన్ 26 (విజయక్రాంతి) : జిల్లాలోని మఠంపల్లి మండల కార్యాలయాలలో భద్రత కొరవటంతో ప్రైవేటు వాహనా లకు పార్కింగ్ అడ్డాలుగా మారుతున్నాయి. సరైన గేట్లు, వాచ్ మెన్లు లేకపోవడం వంటి కారణాల వల్ల స్థానికులు, బయట వ్యక్తులు కార్యాలయ ఆవరణను వాహనాలను నిలిపేందుకు వాడుకుంటున్నారు. దీని వల్ల ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు ఆటం కం కలుగుతుంది.

మండలంలోని మండల కార్యాలయాలు అన్ని ఒకే దగ్గరగా ఉండడం ప్రజలకు సౌకర్యవంతం అయినప్పటికీ వాటికి సరైన రక్షణ లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలకు అడ్డాగా మారిపోయింది. దీంతో మండల కార్యాలయాల్లో వివిధ పనుల నిమిత్తం వచ్చే వ్యక్తుల వాహనాలు పెట్టుకోవడానికి వీలు లేకుండా పోయింది.  గతంలో మండల కార్యాలయాల సమూహానికి గేటు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించారు.

కానీ ఇంతవరకు ఆ గేట్ ను ఏర్పాటు చేయకపోవడంతో సమస్య రాను రాను మరింత జటిలంగా మారుతుంది.  ఏ సమయంలో చూసినా కార్యాలయాల్లో ఒక మెయిన్ రోడ్డు  మాదిరి వాహనాలు తిరగటం, రాత్రి రక్షణగా  వాచ్ మెన్ లు లేకపోవడంతో మండల కార్యాలయాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని స్థానికులు చెబుతున్నారు. 

 పేరుకుపోతున్న చెత్త : 

కార్యాలయాల్లో చెట్లు ఉండటంతో చెట్ల ఆకులు, కొమ్ములు గాలి వానకు కొట్టుకొచ్చి చెత్త కుప్పలతో అస్తవ్యస్తంగా మారిపోయాయి. పాములు, తేళ్లకు ఆవాసాలుగా మారాయి. కార్యాలయల ఖాళీ స్థలాలు నెలల తరబడి శుభ్రం చేయకపోవడం ఇబ్బందికరంగా ఉన్నాయని కార్యాలయానికి వచ్చే ప్రజలు చెబుతుండడం గమనార్హం. 

మహిళలకు తప్పని అవస్థలు : 

పెద్ద మండలం కావడం అందునా అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండడంతో వివిధ పనుల నిమిత్తం మండల కార్యాలయాలకు వచ్చే మహిళలకు మూత్రశాలలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నట్టు మహిళలే చెబుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి అన్ని వసతులు కల్పించడంతోపాటు సరైన రక్షణ ఏర్పాటు చేసి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

 సమస్యలు లేకుండా చూస్తాం 

మండల పరిషత్ కార్యాలయంలో వ చ్చే పబ్లిక్ కోసం అ న్ని వసతులు కల్పిం చి ఏ విధమైన సమ స్య లేకుండా చూస్తాం. అలాగే రాత్రిపూట వాచ్‌మెన్ ఉండేవిధంగా, ప్రైవే ట్ వాహనాలుపార్కింగ్ చేయకుండా చూ స్తాం. ప్రజలు కూడా దీనికి సహకరించి కార్యాలయంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. 

ఉమామహేశ్వరరావు,

మండల అభివృద్ధి అధికారి,

మఠంపల్లి