ధాన్యం కొనుగోళ్లు మరింత వేగం
- ఇప్పటి వరకు 8,575 కేంద్రాల్లో 14.80 లక్షల టన్నుల సేకరణ
- రైతుల ఖాతాల్లో రూ.2001.96 కోట్లు జమ
- అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలింపు
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): అకాల వర్షాలు సంభవిస్తున్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బం దులు పడకుండా చూడాలని సూచించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరితో కలిసి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో పెరిగిన ధా న్యం ఉత్పత్తికి అనుగుణంగా కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇప్పటి వరకు కో టి 84 లక్షల మంది రైతుల నుంచి 14.80లక్షల టన్నుల ధాన్యం కొన్నామని వెల్లడిం చారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.2001.96 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కొనుగోలు కేంద్రానికి భారీ ఎత్తున ధాన్యం తరలి రానున్నందున కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన పద్దతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం వస్తున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శనివారం రాత్రి పడిన అకాల వర్షాలతో సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ వంటి జిల్లాలో 299 మెట్రిక్ టన్నుల ధా న్యం తడిసిపోయినట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. తడిసిన బియ్యాన్ని తక్షణమే బియ్యం మిల్లులకు తరలించేందుకు ఏర్పా ట్లు పూర్తి చేశామన్నారు. రాబోయే 3-4 రోజులు అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనను అధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు.
కొనుగోలు కేంద్రాలలో టార్బాలిన్ లను వినియోగించేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సివిల్ సప్లయ్, రవాణా శాఖ కమిషనర్లు స్టీపెన్ రవీంద్ర, ఇలంబర్తి, కార్మిక ఉపాధి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి హరిచందన పాల్గొన్నారు.






