5 May, 2026 | 6:13 AM

తాహసీల్దార్‌ను సన్మానించిన నాయకులు

05-05-2026 12:45 AM

అలంపూర్, మే 4: మానవపాడు మండల తహసీల్దార్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఎండి మన్సూర్ ఆలీ సిద్ధిఖీని కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ మేరకు సోమవారం వారి కార్యాలయంలో ఎమ్మార్వో ను కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మండల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. కలిసిన వారిలో డిసిసి జిల్లా నాయకులు శేఖర్, మాజీ ఎంపిటిసి శేఖర్ , దాన చందర్ తదితరులు ఉన్నారు.