27 June, 2026 | 11:14 AM

ఇన్‌స్టాల్ చేసిన క్షణమే.. బ్యాంక్ ఖాతా ఖాళీ!

27-06-2026 09:59 AM

బోధన్ జూన్ 27(విజయ క్రాంతి): తెలియకుండా ఇన్స్టాల్ చేసుకున్న ఒక యాప్ వల్ల బోధన్ రూరల్ పరిధిలో ఒక వ్యక్తి రూ.6.70లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్ కేటుగాళ్లు దూరం నుంచే అతని ఫోన్ను నియంత్రిస్తూ, OTPలతో విడతల వారీగా డబ్బులు కాజేశారు. దీంతో ఆ వ్యక్తి పోలీసుకు ఫిర్యాదుచేశాడు. అపరిచిత లింకులు, APK ఫైళ్లు, స్క్రీన్ షేరింగ్ యాప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబరు ఫిర్యాదుచేయాలని ఎస్సై రాజశేఖర్ తెలిపారు.