చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య.!
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని దుండగులు వేటకొడవళ్ళతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. బైకుపై వెళ్తుండగా దుండగులు అటకాయించి పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు తెలుస్తోంది ఈ ఘటనతో వ్యక్తి రక్తపు మడుగులో మిగతాజీవిగా పడి ఉన్నాడు. మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి చెందిన యాదయ్యగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల పూర్తి కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.






