27 June, 2026 | 11:56 AM

ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం: 'కింగ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ ప్లే' కె. భాగ్యరాజ్ ఇకలేరు

27-06-2026 10:44 AM

కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇక లేరు

చెన్నై: చలన చిత్ర పరిశ్రమలో(Film industry) మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్( K Bhagyaraj passed away) కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కె. భాగ్యరాజ్ గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. భాగ్యరాజ్ తన కెరీర్ లో 75 సినిమాల్లో నటించి, 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇండియన్‌ సినిమాలో 'కింగ్ ఆఫ్ స్క్రీన్  ప్లే'గా(King of Screenplay) భాగ్యరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లరి నరేష్(Allari Naresh) నటించిన 'పెళ్లయింది కానీ' సినిమాకు భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. ఇంట్లో 'ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు', 'అబ్బాయిగారు' సినిమాలకు ఆయన స్క్రిప్ట్ అందించారు. తెలుగులో భాగ్యరాజ్ నటించిన చివరి సినిమా కుబేర(Kuberaa). 'కుబేర' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. కె. భాగ్యరాజ్ మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది.