ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, మే 4 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
రాష్ట్ర స్థాయి గ్రీవిన్స్ లకు కూడ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు దరఖాస్తు లను పరిష్కరించాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలకి సంబందించి 53 దరఖాస్తులు, డిఆర్డిఏ 7, డిపిఓ 5, డిఎం అండ్ హెచ్ ఓ 4, వివిధ శాఖలకు సంబంధించి 36 దరఖాస్తులు రాగా మొత్తం 105 దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డిపిఓ యాదగిరి, డిఎంహెచ్వో పి వెంకటరమణ, సంక్షేమ అధికారులు శంకర్, నరసింహారావు, దయానంద రాని, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.






