విజయ డెయిరీ పాల ఉత్పత్తులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ టౌన్, మే 4: ప్రభుత్వ డెయిరీ విజయ పాల ఉత్పత్తులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు సోమవారం ప్రసాద్ ఉడిపి హోటల్ ఎదురుగా రవీందర్ నగర్ లో విజయ తెలంగాణ డెయిరీ మిల్క్ పార్లర్ షాప్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు కల్తీ లేని పాల ఉత్పత్తులను తెలంగాణ విజయ డెయిరీ అందిస్తుందన్నారు మన్నికగా ఎలాంటి కల్తీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ పాల డెయిరీ ఆహార ఉత్పత్తులను ప్రజలకు తక్కువ ధరతో అందిస్తుందన్నారు.
ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా పాలు,నెయ్యి ,పెరుగు,బాదం మిల్క్ ,పన్నీర్, ఐస్ క్రీములు, కోవా, వాటర్ బాటిల్ ,కీర్ మీక్స్, మిల్క్ కేక్, బట్టర్ మిల్క్, ఫుల్ క్రీం పాలు, టెట్రా మిల్క్ ,తదితర ఉత్పత్తులను డెయిరీ నుండి ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు కల్తీ లేని ఆహార ఉత్పత్తులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు రామగిరి అఖిల్ రావు, ఆల్లి సుభాష్ యాదవ్, అల్లి మల్లికార్జున్ యాదవ్, డైరీ డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ విజయ డెయిరీ నల్గొండ జిల్లా డిస్ట్రిబ్యూటర్ వి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






