14 July, 2026 | 1:04 AM

ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి

13-07-2026 09:23 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ ఏపీవో జనరల్ వసంతరావు అన్నారు. సోమవారం కార్యాలయం  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం సేకుగూడా గ్రామానికి చెందిన టెకం ఓంసాయి బాయి తనకి పై చదువుల కొరకు ఆర్థిక సహాయం అర్జీ, సిరికొండ మండల సుమాంగోంది గ్రామానికి  చెందిన రాథోడ్ పరుబాయ్ తనకి  రైతు భరోసా మంజూరు కొరకు అర్జీ కోరారు.

వాంకిడి మండలం బంబార గ్రామానికి చెందిన మారు బాయి తనకి భూమి పట్టా మంజూరు కల్పించామని  అర్జీ కోరారు. సిరికొండ మండలం వైపేట్ గ్రామానికి చెందిన రవీందర్ తనకి  టెంట్ హౌస్ లోన్ ఇప్పించమని  దరఖాస్తు పెట్టారు,ఉట్నూర్ మండలం హీరాపూర్ గ్రామనికి చెందిన గ్రామస్తులు తమ గ్రామానికి బోర్ వెల్, త్రిఫెజ్ విద్యుత్, సోలార్ మంజూరు కల్పించామని కోరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధిం చిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.