14 July, 2026 | 3:57 AM

రేవంత్‌రెడ్డి తెలంగాణ జలద్రోహి!

14-07-2026 12:49 AM
  1. చంద్రబాబుకు తొత్తుగా మారి రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు
  2. అక్రమ ప్రాజెక్ట్‌లను ఆపే సామర్ధ్యం ఈ సర్కార్‌కు లేదు
  3. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా బుద్ది మారదా ?
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్

సంగారెడ్డి, జూలై 13 (విజయక్రాంతి) : ఏపీ సీఎం చంద్రబాబుతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమ్మక్కై తెలంగాణ ఉద్యమ ద్రోహిగానే కాకుండా జల ద్రోహిగా మారాడని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సో మవారం ఆయన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్ర మ ప్రాజెక్టులను ఆపే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సహా ఏపీ అక్రమ ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్టే తెచ్చిందన్నారు.

చంద్రబాబుతో అంతర్గత ఒప్పందం చేసుకుని తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. దేశంలోనే ఇంత లోపభూయిష్టమైన సూట్ మరొకటి ఉండదని, బనకచర్ల విషయంలో బీఆర్‌ఎస్ ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నా రేవంత్ సర్కార్ పట్టించుకోలేద న్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ అధికారుల సమావేశాల వివరాలు బయట పెట్టాల ని, అలాగే కర్ణాటకలో ముగ్గురు సీఎంల సమావేశంలో ఏం జరిగిందో ప్రజలకు వెల్లడించాల ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

పాలమూరుకు ఎన్వోసీ తెస్తానని తెలంగాణ నీటి హక్కు లను తాకట్టు పెడుతున్నారని, పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీల నీళ్లు తెలంగాణ హక్కు అని ఇందుకు ఎన్వోసీ అవసరం లేదన్నారు. పోలవరం ఇంటర్ లింకింగ్‌కు అనుమ తిస్తే తెలంగాణ నీటి ప్రయోజనాలకు విఘా తం కలుగుతుందన్నారు. ఇదంతా తెలిసి కూడా రేవంత్ దొంగచాటు వ్యవహారం చేస్తున్నాడని ఆరోపించారు.

దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో, నల్లమల ఎక్కడుందో కూడా ప్రభుత్వానికి తెలియదని, ఆదిత్యనాథ్ దాస్ మాటలు విని తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే ఊరుకోమని హరీశ్‌రావు హెచ్చరించారు. గతంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సూట్ వేసుకుని సుప్రీంకోర్టుకు వెళ్లారు... ఇప్పుడు ఎందుకు సూట్ వేసుకొని వెళ్ళలేదో చెప్పాలన్నారు.బీఆర్‌ఎస్ గట్టిగా ప్రశ్నించిన తర్వాతే దేవాదుల వద్దకు వెళ్లారని, మోటార్లు ఆన్ చేశారని గుర్తు చేశారు.

భట్టి విక్రమార్క దేవాదులపై తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేశామని చెబుతున్నారని, 2020 బీఆర్‌ఎస్ ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసిందన్నారు. కన్నెపల్లి వద్ద నీళ్లు ఉన్నా ఎందుకు లిఫ్టింగ్ చేయడం లేదని ప్రశ్నించారు. దేవాదులకు నీరు అందుతున్నదంటే అది బీఆర్‌ఎస్ నిర్మించిన సమ్మక్క బ్యారేజీ వల్లేనని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం బట్టబయలైందని, ప్రభుత్వం వేసిన సూట్ డిస్మిస్ అయ్యిందని హరీశ్‌రావు తెలిపారు. గోదావరి బనకచర్ల విషయంలో ఏపీ ముందుకు వెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు. బీఆర్‌ఎస్ నిలదీయడంతోనే ప్రభుత్వం బ్యాక్‌డేట్ లేఖలు రాసిందన్నారు.

సూట్ కూడా సరిగా వేయలేకపోయారని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, కావాలనే లోపభూయిష్టమైన సూ ట్ వేశారని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.