సిద్ధ్దాపూర్, జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ఎమ్మెల్యే పోచారం సమీక్ష
14-07-2026 01:00 AM
బాన్సువాడ, జూలై 13 (విజయ క్రాంతి): హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోర లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై, ఎలినోవా ప్రభావంతో వర్షాభావం పంటల సంరక్షణపై సోమవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోర లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై,ఎలినోవా ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో రైతులు వేసిన పంటలను ఎలా కాపాడుకోవాలనే అంశంపై ఇరిగేషన్ అధికారులు ఇంచార్జి CE దక్షిణా మూర్తి, EE రాజశేఖర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.






