14 July, 2026 | 4:03 AM

నా కులాన్ని నేను తిడుతానా?

14-07-2026 01:01 AM
  1. కాంగ్రెస్‌లో చిచ్చుకు కుట్ర 
  2. కాంగ్రెస్ సీనియర్ నేత రామ్మోహన్‌గౌడ్ 

ఎల్బీనగర్, జూలై 13: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి బీసీ నాయకులపై చేసినట్లు వచ్చిన వ్యా ఖ్యలపై ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మంటలు చెలరేగుతున్నాయి. తాను గౌడలను తిట్టినట్లు, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి అన్నట్లు వచ్చిన ఆడియో క్లిప్‌లపై రామ్మోహన్‌గౌడ్ స్పందించారు. సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

తనకు రాజకీయంగా అండగా ఉన్న గౌడల ను కించపరిచే విధంగా ఎలా మాట్లాడుతానని ప్రశ్నించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో విభజనలు తేవడానికి ప్రతిపక్ష పార్టీలు కుట్రచేస్తున్నాయని ఆరోపించా రు. అసలు ఆ ఆడియో క్లిప్‌లను ఎక్కడి నుంచి పోస్టుచేస్తున్నారో పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గౌడ సమాజాన్ని తాను ఎప్పుడూ అవమానించలేదని స్పష్టంచేశారు. తనను రాజకీయ ప్రత్యర్థులు దెబ్బసే కుట్ర అన్నారు.