స్తంభాలు వేసి.. తీగలు మరిచి!
- వైర్లు ఏర్పాటు మరిచారు
- విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం
- గ్రామాల ప్రజలకు శాపం
- సమాచారం ఇచ్చిన పట్టించుకోని అధికారులు
- పొంచి ఉన్న ప్రమాదాలు
- విద్యుత్ శాఖ అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు.
కామారెడ్డి, జూలై 13 (విజయక్రాంతి): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ లైన్లు లేని కాలనీలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ లైన్లు అమర్చాల్సి ఉండగా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని సదాశివ నగర్, రామారెడ్డి, రాజంపేట, గాంధారి, లింగంపేట్, బిబిపేట్, నిజాంసాగర్, మద్నూర్, బిచ్కుంద తదితర మండలాల్లోని ఆయా గ్రామాల్లో విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాలను అమర్చారు.
విద్యుత్ స్తంభాలకు వైర్లు అమర్చకపోవడం తో గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ స్తంభాలకు విద్యుత్ వైర్లు అమర్చాలని విద్యుత్ శాఖ అధికారులు ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్న పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం బొంపల్లి గ్రామంలో ఏడో వార్డులో విద్యుత్ స్తంభాలు వేసి తీగలను ఏర్పాటు చేయడం మర్చారు. ఇలాంటి సంఘటనలు ఈ యొక్క గ్రామంలో అనుకుంటే పొరపాటే. పలు గ్రామాల్లో ఇలాంటి ఇబ్బందులే ఉన్నాయి. హడావుడిగా విద్యుత్ స్తంభాలు అమర్చిన అధికారులు వాటికి విద్యుత్ వైర్లను మార్చడం లేదు.
గ్రామస్తులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
గ్రామస్తులు విన్నవించిన చేస్తామంటూ విద్యుత్ శాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తీరు మార్చుకోవడం లేదు. మరికొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు వంగి ఉన్నాయి. సరి చేయాలి కానీ విద్యుత్ అధికారులు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం విద్యుత్ స్తంభాల మరిచిన విద్యుత్ వైర్లు మాత్రం అమర్చడం లేదని బొంపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు తెలిపారు. అసలే వర్షాకాలం కావడంతో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ స్తంభాలు వంగి వాటికి అమర్చిన తీగలు కిందికి వేలాడుతున్నాయి.
ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అధికారులకు విన్నవించిన విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విద్యుత్ తీగలను అమర్చాలని కోరుతున్నారు. వంగిపోయిన విద్యుత్ స్తంభాలను తీగలను సరిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ప్రమాదాలతో ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సరి చేయాలని కోరుతున్నారు.
అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం
కామారెడ్డి జిల్లాలో విద్యుత్ స్తంభాలకు విద్యుత్ వైర్లు అమర్స్తున్నాం. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు అమర్చకుంటే, తీగలు అమర్చకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి. నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ పొలాల వద్ద గాలికి వంగిపోయిన విద్యుత్ స్తంభాలు ఉంటే, వైర్లు కిందికి వాలితే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియపరచాలి. ట్రాన్స్ఫార్మర్ల వద్ద టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. వాటికి ఫిర్యాదు చేయవచ్చు. నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటాం.
- సాలీయా నాయక్, విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్, కామారెడ్డి






