14 July, 2026 | 4:04 AM

తిప్పాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ

14-07-2026 01:02 AM

భిక్కనూర్, జూలై 13(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలంలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి మొత్తం 32 మందికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇందులో తిప్పాపూర్ గ్రామానికి 13 గృహాలు కేటాయించగా, సోమవారం 3 లబ్ధిదారులైన ఇళ్లిందల నర్సావ్వ, శ్యామర్ధి బాబావ్వ, బీమారి స్వరూప తమ నూతన గృహాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని, గుడిసెల్లో నివసిస్తున్న అర్హులకే ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, ఉపసర్పంచ్ జీవన్, మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మయ్య, నాయకుడు సాయిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.