అయోధ్య విరాళాల కేసుపై సీబీఐ విచారణ జరిపించాలి
- ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు
- భద్రాచలంలో గంట పాటు మౌన దీక్ష నిర్వహించిన వీహెచ్
భద్రాచలం, జులై 13, (విజయక్రాంతి): దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం వద్ద తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీహెచ్ హనుమంతరావు సోమవారం గంటపాటు మౌన దీక్ష నిర్వహించారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాల వినియోగంపై సీబీఐ విచారణ జరిపించాల ని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టినట్లు వీహెచ్ తెలిపారు.
అయోధ్య రామమందిర నిర్మాణానికి భక్తులు అందించిన విరాళాల వినియోగంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారం పై కేంద్ర ప్రభుత్వం మౌనం వీడి స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని ఆ యన కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జి ల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






