ఓపీఎస్ అమలు చేయాలి
టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఏపీ తరహాలో తెలంగాణలోనూ సీపీఎస్ నుం చి ఓపీఎస్‌కు ఉద్యోగులు మారేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో తేవాలని టీజీ ఈ జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ కోరారు. ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులందరికీ ఓపీఎస్‌గా మార్చాలని సోమవారం ప్రకటనను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం (13న) జారీ చేసిన జిఓ 53 ద్వారా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (ఓపీఎస్)లోకి మారేందుకు అవకాశం కల్పించింద న్నారు.
సెప్టెంబరు 1, 2004కు ముందు నియామక నోటిఫికేషన్ లేదా ప్రకటన వెలువడిన పోస్టులకు చాలా మంది ఎంపి కయ్యారన్నారు. అయినప్పటికీ వీరంతా కూడా సీపీఎస్‌లోనే ఉన్నారని, దీని పరిధిలో ఉన్న ఉద్యో గులందరికీ ఓపీఎస్‌ను ఎంచుకునే వీలు కల్పించాలని కోరారు. దీంతో ఎంతో మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.






