4 August, 2026 | 2:33 AM

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

04-08-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, ఆగష్టు 3 (విజయక్రాంతి) : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కా ర్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడు తూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరి యు డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు.

పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆ దేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శా ఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 59, డిడబ్ల్యుఓ 10, డిపిఓ 7, డి ఏం అండ్ హెచ్ ఓ 6, వివిధ శాఖలకు సంబంధించి 35 దరఖాస్తులు రాగా మొత్తం 117 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్‌ఓ ప్రేమ్ రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, సిపిఓ కిష న్, డిఇఓ అశోక్, డిపిఓ యాదగిరి జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.