పట్టణ ప్రగతితో ప్రజల భాగస్వామ్యం
07-03-2026 04:59 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆదేశాలంధరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వాములు కావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని 26 27 28 వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తితో కలిసి ప్రగతి పాలన పనులను పరిశీలన చేశారు. వార్డులో పారిశుద్ధ నిర్వహణ, తాగునీరు విద్యుత్ లైట్లు మౌలిక సదుపాయాలు ఇతర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అధికారులు అణువు కౌన్సిలర్ గోపి తదితరులు ఉన్నారు.




