16 April, 2026 | 1:24 PM

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్

16-04-2026 11:51 AM

కామ్రేడ్ పెద్దబ్బాయి కు నివాళులర్పించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు  పోతినేని సుదర్శన్

మధిర, ఏప్రిల్ 16(విజయ క్రాంతి): మధిర సిపిఎం పార్టీ(Madhira CPM Party)  సీనియర్ నాయకులు తాపీ మేస్త్రి, సుపరిచితుడు పెద్దబ్బాయి (ఆది వెంకటేశ్వర్లు) బుధవారం సాయంత్రం 8 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు. ఈ సందర్భంగా మధిర పట్టణంలోని వారి నివాసంలో పార్థివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేశారు.

ఆయన మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దు, మేమున్న అని వారి కుటుంబానికి ధైర్యాన్ని  కల్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి,  పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, శీలం నరసింహారావు,పడకంటి మురళి, మంద సైదులు, తేలబ్రోలు రాధాకృష్ణ, యుటిఎఫ్ ఆంజనేయులు ,లక్ష్మణ రావు,మల్లాచారి, ఆశీర్వాదం, సాంబయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.