16 April, 2026 | 1:25 PM

మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి

16-04-2026 11:36 AM

యారం స్వరూప చిత్రపటానికి నివాళులు..

బూర్గంపాడు,(విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్య , గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) లక్ష్మీపురం గ్రామంలో పలు కుటుంబాలను బుధవారం పరామర్శించారు. ఇటీవల మోకాలు ఆపరేషన్ చేయించుకున్న మాజీ సర్పంచ్ పోతిరెడ్డి సత్యవతిని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులను పలకరించారు. అంతకుముందు యారం స్వరూప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబానికి కొండంత ధైర్యాన్ని అందించారు. ఆయన వెంట పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ సోసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి, మండలంలోని పలు పంచాయతీ సర్పంచులు, ఉపసర్పంచులు, మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పొంగులేటి చిరునవ్వు పలకరింపుతో కార్యకర్తలు ఆనందోత్సవం

మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించడానికి విచ్చేసినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలు కార్యకర్తలను చూసి చిరునవ్వుతో తమ్ముడు, అన్న, అక్క అంటూ నవ్వుతూ పలకరింపుతో కార్యకర్తలలో ఒక్కసారిగా నూతనత్తేజం ఉట్టి పడ్డది. కాసేపు సరదాగా పలువురు పొంగులేటితో సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు.