6 June, 2026 | 3:05 AM

ఉత్తమ్ ఫేస్‌బుక్ పేజీకి ఆదరణ

06-06-2026 01:37 AM

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్‌బుక్ పేజీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఫేస్‌బుక్‌లో ఆయన పేరున్న పేజీకి 2 మిలియన్ల ఫాలోవర్లు వచ్చారు. ఈ సందర్భంగా తనను ఆదరిస్తున్న ప్రజలకు మంత్రి ఉత్తమ్ కృతజ్ఞతలు తెలుపుతూ.. పేజీలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా చాలామంది ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కోసం నిరంతరం శ్రమ పడటం, నిత్యం వారిలో ఉండటమే ఇందుకు నిదర్శనమని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రజాదారణలో పొందడంలో ముందుండే నేత అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. తన పదవిని ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తున్నందుకే ఇంతటి ఆదరణ అని మరో నెటిజన్ అన్నారు.