6 June, 2026 | 3:06 AM

పర్యావరణ పరిరక్షణ ప్రతిపౌరుడి బాధ్యత

06-06-2026 01:36 AM
  1. ‘ఏక్ పేడ్ మా కే నామ్’లో భాగస్వాములు కావాలి
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రకృతిని కాపాడటం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం మనందరి కర్తవ్యమని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఇచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పిలుపు స్ఫూర్తితో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మొక్క నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని ప్రారంభించిన ఈ కార్యక్రమం కేవలం మొక్కలు నాటేదే కాదని, అది తల్లిపట్ల గౌరవాన్ని వ్యక్తపరుస్తూనే ప్రకృతిని  కాపాడుకోడం పట్ల సమాజంలో అవ గాహన పెంపొందించే ఒక మహత్తర ప్రజా ఉద్యమమన్నారు.

ప్రకృతి పరిరక్షణ, వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నివారణ, జీవ వైవిధ్య సంరక్షణ (బయోడైవర్సిటీ) కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సుస్థిరాభివృద్ధి, హరిత అభివృద్ధి (గ్రీన్ గ్రోత్) లక్ష్యాలతో దేశం ముందుకు సాగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.